రాములమ్మ అరెస్టుకు పోలీసులు మరోసారి ప్రయత్నం

Vijayashanthi
హైదరాబాద్‌ : రెచ్చగొట్టే ప్రకటన చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని అరెస్టు చేసేందుకు పోలీసులు మరోసారి ప్రయత్నం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమెను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు తెరాస కార్యకర్తలు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. పోలీసులు విజయశాంతి నివాసంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వారితో తెరాస కార్యకర్తలు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో విజయశాంతిని అరెస్టు చేయకుండానే పోలీసులు వెళ్లిపోయారు.

కాగా, ఆమెను అరెస్టు చేయడానికి పోలీసులు శనివారం ఉదయం కూడా ప్రయత్నించారు. తెరాస కార్యకర్తలు పెద్ద యెత్తున ఆందోళనకు దిగారు. పోలీసులను లోనికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. విజయశాంతిని ఈ రోజు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆమెను అరెస్టు చేసేందుకు మరిన్ని సాయుధ బలగాలను రప్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+