14 రోజుల రిమాండ్: చంచల్ గుడా జైలుకు రాములమ్మ

బెయిల్ పిటిషన్ వేయడానికి విజయశాంతి నిరాకరించారు. అరెస్టు చేసే సమయంలో ఎసిపి చంద్రమౌళి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. తనను అరెస్టు చేయడానికి మహిళా పోలీసులను కూడా తీసుకు రాలేదని ఆమె విమర్సించారు. ఈ విషయాన్ని ఆమె మెజిస్ట్రేట్ చెప్పారు. తాను అంతర్గత సమావేశంలోనే మాట్లాడానని, తెలంగాణ ప్రజలు ఇచ్చే నినాదాన్ని తాను వాడానని, అది రెచ్చగొట్టే ప్రకటన కాదని విజయశాంతి వాదించారు. పోలీసులు తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications