నాటకీయంగా తెరాస ఎంపి విజయశాంతి అరెస్టు

నిజానికి, విజయశాంతిని పోలీసులు శనివారం మధ్యాహ్నం ఇంటిలో అరెస్టు చేయాలని భావించారు. అయితే, తాను మెదక్ జిల్లా పర్యటనకు బయలుదేరుతున్నట్లు ప్రకటించి ఆమె ఇంటి నుంచి బయలుదేరారు. దీంతో పోలీసులు ఇంటి నుంచి బయలుదేరగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విజయశాంతిని పోలీసు స్టేషనుకు తరలించారు. కాగా, విజయశాంతి బెయిల్ కు దరఖాస్తు చేసుకోకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయశాంతి చేసిన వ్యాఖ్యలను నిర్ధారించుకున్న తర్వాతనే అరెస్టుకు ఉపక్రమించామని హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ అన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకే విజయశాంతి అరెస్టుకు ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications