బెయిల్: అయినా జైలులోనే రాములమ్మ నిరాహార దీక్ష

విజయశాంతి అరెస్టును తెరాస నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆమెను ఉద్దేశ్యపూర్వకంగానే అరెస్టు చేశారని తెరాస నాయకుడు హరీష్ రావు విమర్శించారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈసారి తాము గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. విజయశాంతి అరెస్టును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఖండించారు.
కాగా, కాంగ్రెసు శాసనసభ్యుడు జగ్గారెడ్డిని పోలీసులు శనివారం సంగారెడ్డి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కాంగ్రెసు కార్యకర్తలు కోర్టుకు పెద్ద యెత్తున చేరుకున్నారు. దీంతో కోర్టు ఆవరణలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాలుకు కాలు తీసేస్తామంటూ, అంతు చూస్తామంటూ జగ్గారెడ్డి ఓ సభలో హరీష్ రావుపై వ్యాఖ్యానించారు.తనకు బెయిల్ అక్కర లేదని, జైలులోనే ఉంటానని జగ్గారెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications