హైదరాబాద్: రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి గౌరవార్థం ముఖ్యమంత్రి రోశయ్య ఏర్పాటు చేసే విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సోమవారం రవీంద్రభారతిలో జరిగే శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం ఉత్సవాలను ప్రారంభిస్తారు.. రాష్ట్రపతి రాక సందర్భంగా పోలీసులు గట్టిభద్రత ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతికి ప్రొటోకాల్ అత్యున్నతంగా ఉంటుంది. అమె పర్యటించే దారుల్లో దాదాపు పావు గంట్ సేపు ట్రాఫిక్ నిలిచిపోతుంది. సీనియర్ ఐపిఎస్ అధికారులు ఆయా మార్గాల్లో స్వయంగా నిలబడి భద్రతను పర్యవేక్షిస్తారు.