నడిరోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు నాయుడు: అరెస్టు

అంతకు ముందు పార్టీ దీక్ష శిబిరానికి చంద్రబాబు చేరుకున్నారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాహనాల టైర్లలో గాలి తీసేయడానికి ప్రయత్నించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో చంద్రబాబు పోలీసులను తోసుకుంటూ రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. హైదరాబాదులోని రాస్తారోకోకు దిగిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులును పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications