నాకు గృహ నిర్బంధం విధించడం దురదృష్టకరం: కిషన్ రెడ్డి

Kishan Reddy
హైదరాబాద్‌: భారత్ బంద్ సందర్భంగా తనకు పోలీసులు గృహ నిర్బంధం విధించడాన్ని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి వ్యతిరేకించారు. పోలీసులు తనను ఇంటి నుంచి కదలకూడదంటూ చేసిన ఆదేశాలను ఆయన సోమవారం తీవ్రంగా ఖండించారు. శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా నిరసన వ్యక్తం చేసే అధికారం తనకుందని ఆయన అన్నారు.

ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన హర్తాళ్‌లో తమ పార్టీ కూడా పాలుపంచుకుంటోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి బంద్‌లో పాల్గొనే అవకాశం తనకు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ధరలపై పునరాలోచించకుండా ఇలా గృహ నిర్బంధానికి పాల్పడడం దురదృష్టకరమని కిషన్‌ రెడ్డి అన్నారు. సామాన్యుల నడ్డి విరిచేలా ధరలు పెంచుతూ ప్రతిపక్షాల హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+