అనుమతి రాకున్నా జగన్ ఓదార్పు షెడ్యూల్ విడుదల

YS Jagan
శ్రీకాకుళం‌: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టే ఓదార్పు యాత్ర షెడ్యూల్ ను ఆ జిల్లా యువ నేతలు వెల్లడించారు. పార్టీ అధిష్టానం అనుమతితో సంబంధం లేకుండా వారు ఈ షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జగన్ పర్యటన కార్యక్రమాన్ని వారు ప్రకటించారు. ఈ ఓదార్పు యాత్ర రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని కాంగ్రెసు పట్టణ కాంగ్రెసు అధ్యక్షుడు శిమ్మ రాజశేఖర్ ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. పర్యటనలో ఎలాంటి ఆర్భాటాలు, హంగులు ఉండవని ఆయన చెప్పారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యాత్ర సాగుతుందని ఆయన అన్నారు.

తన పర్యటన సందర్భంగా జగన్ పలు మండల కేంద్రాల్లో, కూడళ్లలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారని ఆయన చెప్పారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా యునజన కాంగ్రెసు అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, జిల్లా కాంగ్రెసు నాయకులు కెఎల్ ప్రసాద్, రత్నాల నర్సింహమూర్తి, ఎం. స్వరూప్, శ్రీనివాస రెడ్డి మధ తదితరులు పాల్గొన్నారు. కాగా, జగన్ ఓదార్పు యాత్రకు మంత్రులు, శాసనసభ్యులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, వారి వారసులు ఈ యాత్రను విజయవంతంగా చేయడానికి కృషి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+