తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మార్గం: శ్రీకృష్ణతో తెలంగాణ కాంగ్రెసు

Telangana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప సమస్యకు మరో పరిష్కార మార్గం లేదని కాంగ్రెసు తెలంగాణ నాయకులు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణ కాంగ్రెసు నాయకులు మంగళవారం తమ వాదనలు వినిపించారు. అంతకు ముందు శ్రీకృష్ణ కమిటీ ముందు వాదనలు వినిపించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ర్యాలీగా జూబ్లీహాలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రజల ఆకాంక్షలను, వాదప్రతివాదనలను కమిటీ సభ్యుల ముందు ఉంచుతామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కె. జానా రెడ్డి అన్నారు.

అపారమైన సహజ వనరులను వాడుకునే తెలంగాణను దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని కాంగ్రెసు నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పడానికి వేయి కారణాలు చెప్పవచ్చునని మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. అన్ని వైపుల నుంచి పరిశీలించి శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ ప్రాంత మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒక గ్రూపుగా, టిఆర్సీసి నేతలు మోర గ్రూపుగా, తెలంగాణ సారథ్య బృందం పేరుతో మిగిలిన నేతలు ఇంకో గ్రూపుగా శ్రీకృష్ణ కమిటీ ముందు వాదనలు వినిపిస్తున్నారు. మొత్తం 12 అంశాలపై వారు తమ వాదనలను శ్రీకృష్ణ కమిటీ ముందు ఉంచుతున్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+