సోనియాపైనే వ్యాఖ్యలు: ఓదార్పు యాత్రకు వైయస్ జగన్ రెడీ

YS Jagan
హైదరాబాద్‌: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీరును కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తప్పు పట్టారు. అంతేకాదు, ఆమె ఆదేశాలను ధిక్కరిస్తూ శ్రీకాకుళం ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. మడమ తిప్పడం, మాట తప్పడం తన స్వభావంలో లేదని ఆయన చెప్పారు. ఓదార్పు యాత్ర శ్రీకాకుళం జిల్లాలో యధావిధిగా ఈ నెల 8వ తేదీ నుంచి సాగుతుందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం రాత్రి ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. తన తండ్రి తనకు రక్తాన్నే కాకుండా స్వభావాన్ని కూడా పంచి ఇచ్చారని ఆయన అన్నారు.

ఎందుకో గాని సోనియా గాంధీ తన ఓదార్పు యాత్రకు సుముఖంగా లేరని, తన తల్లి ఎంత చెప్పినా ఆమె వినలేదని జగన్ విమర్శించారు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిసినా జగన్ అధిష్టానం మాటను ధిక్కరించడానికే పూనుకున్నారు. సోనియాతో జరిగిన అంతర్గత సంభాషణలను బయట పెట్టడం ద్వారా ఆయన ఒక రకంగా ధిక్కారానికి పాల్పడినట్లేనని భావిస్తున్నారు. తన ఓదార్పు యాత్రను అనవసరంగా రాజకీయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులందరినీ ఒక చోటికి చేర్చి ఆర్థిక సాయం అందించాలని సోనియా సూచించారని, అయితే తన ఓదార్పు యాత్ర కేవలం ఆర్థిక సాయం అందించడానికి మాత్రమే కాదని, ఓదార్పు అంటే విస్తృతార్థం అది కాదని ఆయన వివరించారు. మొత్తం మీద, సోనియా మాటను కూడా బేఖాతరు చేస్తూ జగన్ ఓదార్పు యాత్రకు సిద్ధపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+