వైయస్ జగన్ కాంగ్రెసులో కొనసాగడం సాధ్యమా?

పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులతోనే కాకుండా సోనియాతో కూడా సంబంధాలను చెడగొట్టుకున్న జగన్ ఇక పార్టీలో కొనసాగడం ఏ మాత్రం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత దూరం వచ్చి జగన్ వెనక్కి తగ్గి సోనియా మాటలను శిరసా వహిస్తారని కూడా అనుకోవడానికి లేదు. జగన్ లో పనిచేస్తున్న ఆధిక్య భావన అందుకు ఆయనను పురికొల్పే పరిస్థితి లేదు. పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడమా, తనంత తానుగా జగన్ దారి వేరే దారి చూసుకోడమా అనేది మిగిలి ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications