సోనియా మండిపాటు: వైయస్ జగన్ పై చర్య ఖాయం

YS Jagan
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. తననే ప్రశ్నించే ధైర్యం చేస్తారా అని ఆమె అన్నట్లు తెలిసింది. తనకు సంప్రదాయాలు నేర్చించే స్థాయికి వెళ్తాడా అని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కె. రోశయ్య మంగళవారం ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. జగన్ తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆయనకు సహకరిస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది. అతనికి ఎంత ధైర్యం, తన భర్త వల్ల, తమ కుటుంబం వల్ల వైయస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ అవకాశం దక్కిందని, తననే జగన్ ప్రశ్నిస్తాడా అని సోనియా మండిపడినట్లు చెబుతున్నారు.

జగన్ వ్యవహారాన్ని సోనియా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఆయనపై చర్య తప్పకపోవచ్చునని అంటున్నారు. బహిరంగ లేఖలో చేసిన జగన్ చేసిన పలు వ్యాఖ్యలు సోనియాను ప్రశ్నించే విధంగా ఉన్నాయని, సోనియాను జగన్ ఢీకొట్టడానికే సిద్ధపడ్డారని భావిస్తున్నారు. జగన్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలా, నేరుగా చర్యలు తీసుకోవాలా అనే విషయంపై పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే జగన్ పై చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయి.

జగన్ వ్యవహారంపై మొయిలీ నివేదికను కోరామని, ఆ నివేదిక ఆధారంగా జగన్ పై చర్యలుంటాయని ఎఐసిసి అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది చెప్పారు. జగన్ పట్ల ఇప్పటికే చాలా ఉదారంగా వ్యవహరించామని, ఆ ఉదారతను జగన్ తప్పుగా అర్థం చేసుకున్నాడని అధిష్టానం ఆలోచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+