వైయస్ జగన్ బండారం బయట పెడతా: వి హనుమంతరావు

V Hanumantha Rao
న్యూఢిల్లీ: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు బండారం బయట పెడతానని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగిత వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు అధిష్టానాన్ని ధిక్కరించలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సోనియా గాంధీ అనుమతి లేకుండా జగన్మోహన్ ‌రెడ్డి ఓదర్పు యాత్ర చేయడం సరికాదని ఆయన అన్నారు. అధిష్టానాన్ని ధిక్కరిస్తే జగన్ పై క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆయన అన్నారు. మరణించిన తర్వాత రెండు నెలల లోపల ఓదార్పునకు వెళ్తారు గానీ వైయస్ మరణించిన పది నెలల తర్వాత వెళ్లడమేమిటని ఆయన ప్రశ్నించారు.

వైఎస్‌తో నాకు చాలా అనుబంధం ఉందని, ఎంతో రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అలాంటిది ఆయనే హైకమాండ్ మాట జవదాటలేదని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్ కూడా అధిష్టానం చెప్పిన ప్రకారం నడుచుకుంటే మంచిదని, రాజకీయంగా మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. సోనియా గాంధీ నివాసంలో జరిగిన చర్చలను ఇలా బహిరంగంగా లేక రాయడం ధిక్కారమవుతుందని వీహెచ్ పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న జగన్ యాత్రను విరమించుకుంటే మంచిదని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+