వైయస్ జగన్ ఓదార్పుయాత్ర మరో రోజు పొడిగింపు

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో కడప ఎంపీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ఓదార్పుయాత్రను మరో రోజుకు పొడిగిస్తున్నట్టు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. మొదట నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు ఓదార్పు యాత్ర సాగించాల్సివుంది. కాని మొదటిరోజు నుంచి యాత్రలో జాప్యం జరుగుతుండడంతో కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం పూర్తికావడంలేదు. దీంతో ఈ నెల 11న ఆదివారం ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్రను పూర్తిచేసి తర్వాత తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లడానికి జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నట్టు సమాచారం.

వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా రెండో రోజైన శుక్రవారంనాడు రెండు బాధిత కుటుంబాలను పరామర్శించాల్సి వున్నప్పటికీ ఒక్క కుటుంబానికే పరిమితమయ్యారు. రాత్రి 7 గంటల సమయంలో గార మండలం హుకుంపేట గ్రామానికి చేరుకొని మరువాడ జానకిరాం కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ పది నిమషాలు సమయాన్ని గడిపారు. లక్ష రూపాయలు చెక్కు వున్న కవరును అందజేశారు. రెండో రోజు ఓదార్పు యాత్ర షెడ్యూల్ సమయంకన్నా ఆరు గంటలు ఆలస్యంలో వున్నందున ఎల్ఎన్‌పేట మండలం యంబరాం గ్రామంలో కిలారి సరస్వతి కుటుంబాన్ని ఓదార్చడం ఈరోజుకు సాధ్యం కాకపోవచ్చని జగన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+