మల్కాన్‌గిరి: మావోయిస్టుల విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడిషాలోని మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్‌కు చెందిన సెల్ టవర్‌ను పేల్చివేశారు. బాలిమెల పట్టణ శివారులోని నీలకంబేరు ప్రాంతంలో శనివారం రాత్రి ఈ దురాగతానికి ఒడిగట్టారు.
సాయుధులైన 50 మంది మావోయిస్టులు మందుపాతరతో సెల్‌టవర్‌ను పేల్చివేశారని పోలీసులు ఆదివారం తెలిపారు. తర్వాత ప్రభుత్వానికి, భద్రతా దళాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.