నాకైతే బెదిరింపు కాల్స్ రాలేదు: కే కేశవరావు

రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇంటికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. వి. హనుమంతరావు ఢిల్లీలో ఉండడంతో ఆయన కుమార్తె ఫోన్‌లో మాట్లాడారు. జగన్ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటారంటూ ఫోన్ చేసిన వ్యక్తి తీవ్రంగా మాట్లాడినట్లు సమాచారం. దీనిపై అయన కుటుంబసభ్యులు అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందిస్తూ నా పేరే హనుమంతు, నేను ఎలాంటి బెదిరింపులకు లొంగను అని హనుమంతరావు అన్నారు. ఎవరు తప్పు చేసినా క్షమించరని, పార్టీకి నష్టం చేశారని సోనియాకు ఆప్తుడైన నట్వర్‌సింగ్‌నే పక్కన బెట్టారు. రాజకీయంగా ఎదగాలనుకున్నవారు ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications