ఇస్రో నుంచి నింగికెగిసిన పిఎస్ఎల్వీ సి 15 రాకెట్

Isro launches PSLV
నెల్లూరు: పిఎస్ ఎల్వీ సి -15 రాకెట్ విజయవంతంగా నింగికెగిసింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి సోమవారం ఉదయం గం. 9.22 నిమిషాలకు పిఎస్ఎల్వీ సి - 15 రాకెట్ ను ప్రయోగించారు. ఐదు ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించాయి. ఇస్రోను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అభినందించారు. ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఇస్రోకు చెందిన 694 కిలోల కార్టోశాట్ 2బి ఉపగ్రహాన్ని 639 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలోకి చేర్చింది. తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చేందుకు ఈ తరహా కోర్ అలోన్ రాకెట్ వినియోగిస్తుంటారు. ఇలాంటి రాకెట్లను ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఐదు సార్లు ప్రయోగించారు.

అల్జీరియాకు చెందిన అల్ శాట్ 2ఎ, కెనడాకు చెందిన ఎన్ ఎల్ ఎస్ 6.1 ఐ శ్యాట్ 1 ఉపగ్రహం, స్విట్జర్లాండ్ కు చెందిన ఎన్ఎల్ఎస్ 6.2, టీ శాట్ 1 ఉపగ్రహం, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు సంయుక్తంగా రూపొందించిన అతి సూక్ష్మ స్టడ్ సాట్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలోకి చేర్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+