నాకేమీ ఢోకా లేదు: వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై సిఎం

రాష్ట్ర కాంగ్రెసులో కొందరితో అభిప్రాయ భేదాలున్నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఏనాడూ అధిష్ఠానాన్ని ధిక్కరించలేదని రోశయ్య చెప్పారు. పరిస్థితులను అంచనా వేసి అధిష్ఠానం మనసెరిగి తనను తాను మలుచుకోవాలని జగన్‌కు సలహా ఇవ్వడం తప్ప తానేమీ చెప్పలేనన్నారు. వైఎస్‌కు ఆత్మీయుడిగా ఉన్న కేవీపీ రామచంద్రరావు అధిష్ఠానం ఆలోచనలకు భిన్నంగా నడిచే వ్యక్తి కాదని, జగన్‌ను దారిలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి, పార్టీకి, నష్టం కలగకుండా తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications