హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది వికారుద్దీన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Vikaruddin
హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది వికారుద్దీన్ చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. మత ఘర్షణలు, పోలీసులపై కాల్పుల కేసుల్లో వికారుద్దీన్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరు గుర్తు పట్టకుండా మారు వేషంలో తిరుగుతున్న వికారుద్దీన్ ను పసిగట్టి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రూపురేఖలు మార్చుకుని అతను సికింద్రాబాదులోని ఓ వైద్యుడి ఇంట్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. హైదరాబాదులోని పాతబస్తీలో అనుచరులతో సమావేశమైన అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వికారుద్దీన్ విచారణలో ఇచ్చిన సమాచారం మేరకు అతని సోదరుడు సులేమాన్ ను, మరో ఇద్దరిని కూడా పోలీసుుల అదుపులోకి తీసుకున్నారు. 2008 డిసెంబర్ 3వ తేదీన సంతోష్ నగర్, 2009 మే 18న ఫలక్ నుమా, 2010 మే 14న శాలిబండలో వికారుద్దీన్ పోలీసులపై కాల్పులకు ఒడిగట్టాడు. మూడు చోట్ల కూడా కాల్పులకు వికారుద్దీన్ ఒకే ఆయుధాన్ని వాడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి పెద్ద యెత్తున పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X