తెలంగాణ సినిమా కాబట్టే వీర తెలంగాణను అడ్డుకుంటున్నారా?

నైజాం సీడెడ్ గా పిలిచే తెలంగాణలోని థియేటర్లు 18 మంది చేతుల్లో ఉన్నాయి. సినిమా రంగానికి చెందిన నలుగురైదుగురు వీర తెలంగాణ సినిమాకే కాదు, మరి కొంత మంది సినిమాలకు కూడా థియేటర్లు దొరకకుండా చేస్తున్నారనే విమర్శ ఉంది. ఈ విషయంలో ఇది వరకు ఓసారి ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కూడా నిప్పులు చెరిగారు. అయితే, సినిమా వ్యాపారమని, కనీస లాభాలు కూడా రాని సినిమాలను ప్రదర్శించడం వల్ల నష్టపోతారని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. వీర తెలంగాణకు థియేటర్లు దొరకకపోవడం తెలంగాణ సినిమా కావడం వల్లనే అనేది నిజం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications