నేడో, రేపో మీడియా ముందుకు వికారుద్దీన్: గిరీష్ కుమార్

Girish Kumar
న్యూఢిల్లీ/హైదరాబాద్: వికారుద్దీన్‌ను ఈ రోజు సాయంత్రం గానీ, రేపు గానీ మీడియా ఎదుట హాజరుపరచనున్నట్లు డీజీపీ గిరీష్‌కుమార్‌ బుధవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. వికారుద్దీన్ హైదరాబాదు పోలీసులు అరెస్టు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పోలీసులను ఆయన అభినందించారు. ఇదిలా ఉండగా వికారుద్దీన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అతడి తండ్రి అహ్మద్‌ అన్నారు. 2007 రంజాన్‌ సమయంలో వికారుద్దీన్‌ తమతో మాట్లాడాడని, ఆ తర్వాత అతడి ఆచూకీ తమకు తెలీదని ఆయన చెప్పారు. హనీఫ్ అనే వైద్యుడు ఇంటిలో వికారుద్దీన్ ఆశ్రయం పొందినట్లు పోలీసులు అనుమానించి అరెస్టు చేశారు. హనీఫ్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తన భర్తకు వికారుద్దీన్ తో సంబంధం లేదని హనీఫ్ భార్య అంటోంది.

వికారుద్దీన్ విచారణలో ఇచ్చిన సమాచారం మేరకు అతని సోదరుడు సులేమాన్ ను, మరో ఇద్దరిని కూడా పోలీసుుల అదుపులోకి తీసుకున్నారు. 2008 డిసెంబర్ 3వ తేదీన సంతోష్ నగర్, 2009 మే 18న ఫలక్ నుమా, 2010 మే 14న శాలిబండలో వికారుద్దీన్ పోలీసులపై కాల్పులకు ఒడిగట్టాడు. మూడు చోట్ల కూడా కాల్పులకు వికారుద్దీన్ ఒకే ఆయుధాన్ని వాడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి పెద్ద యెత్తున పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+