కర్నాటక సిఎం యెడ్యూరప్పకు గాలి బ్రదర్స్ భయం

ప్రతిపక్షం గాలి సోదరుల అక్రమ మైనింగ్ పై ఆరోపణలు సంధిస్తూ యెడ్యూరప్ప ప్రభుత్వంపై కాంగ్రెసు యుద్ధం ప్రకటించింది. కర్నాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ కూడా గాలి సోదరులపై కత్తి కట్టారు. వారిని మంత్రివర్గం నుంచి తప్పించే వరకు ఆగేది లేదని ఆయన అంటున్నారు. దీంతో యెడ్యూరప్ప ప్రభుత్వంపై కత్తి వేలాడుతోంది. గాలి సోదరులపై చర్యలు తీసుకునే ధైర్యం యెడ్యూరప్ప చేయలేని స్థితిలో ఉన్నారు. చర్యలు తీసుకుంటే గాలి సోదరులు తమకు మద్దతిస్తున్న 30, 40 మంది సభ్యులతో యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూల్చే ప్రమాదం ఉంది. బిజెపి ప్రభుత్వానికి ముందు గొయ్యి, వెనక నుయ్యిలా ఉంది.












Click it and Unblock the Notifications