చంద్రబాబు నాయుడు బాబ్లీ బస్సు యాత్ర ప్రారంభం

ఈ నెల 23వ తేదీన అఖిల పక్షంతో భేటీ అయ్యేందుకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంగీకరించినందున యాత్ర ఆపేయాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఫోన్ చేసి చంద్రబాబును కోరారు. అయితే, బాబ్లీని ఆపుతామని నిర్దిష్టమైన హామీ ఇస్తేనే బస్సు యాత్ర ఆపుతామని చంద్రబాబు చెప్పారు. కాగా, తెలుగుదేశం ప్రతినిధులు బాబ్లీ వరకు రాకుండా అడ్డుకునేందుకు మహారాష్ట్రలో ఏర్పాట్లు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వరకు బస్సు యాత్రకు రక్షణ కల్పిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications