'మహా' మోసం: చంద్రబాబు నాయుడు సహా టిడిపి నేతల అరెస్టు

తమ పార్టీ నాయకుల అరెస్టు వార్త విన్న వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగి సరిహద్దు దాటిన కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మహారాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మొత్తం 76 మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. తమ పార్టీ నేత చంద్రబాబును వదిలేసిన తర్వాతనే తాము కదులుతామంటూ తెలుగుదేశం కార్యకర్తలు సరిహద్దులో బైఠాయించారు.












Click it and Unblock the Notifications