వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై నేను చెప్పేదేమీ లేదు: వీరప్ప మొయిలీ

Veerappa Moily
హైదరాబాద్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై చెప్పేదేమీ లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. తన పుస్తకం ఆవిష్కరణకు హైదరాబాదు వచ్చిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఓదార్పు యాత్ర తన వ్యక్తిగతమని వైయస్ జగన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. దీనిపై అధిష్టానం ప్రత్యేకంగా ప్రతిస్పందించేదేమీ లేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కె. రోశయ్యపై జగన్ చేసిన విమర్శలపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఆ విమర్శలకు రోశయ్య సమాధానం చెప్తారని ఆయన అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల ప్రచార సభలో తాను పాల్గొనడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య, మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్ రావు, వి. హనుమంతరావు తదితరులు మొయిలీని కలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+