తెలంగాణ బీడవుతుందని సోనియాకు తెలియదా: నాగం

Nagam Janardhan Reddy
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా బాబ్లీ, ఇతర ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ బీడుగా మారుతుందని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలియదా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. సోనియా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలే చేస్తారా అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. బాబ్లీ ప్రాజెక్టును కూడా సోనియా గాంధీ ప్రారంభిస్తారా అని ఆయన ప్రశ్నించారు. బాబ్లీ బస్సు యాత్రకు వెళ్లిన తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని, ఇతర నాయకులను అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. మహిళా శాసనసభ్యులను ఖైదీల్లా చూస్తున్నారని ఆయన అన్నారు. తమ నాయకులను ఐటిఐలో పెట్టి కనీస వసతులు కూడా కల్పించడం లేదని ఆయన విమర్శించారు.

మహారాష్ట్రలో ముంపు ప్రాంతానికి మనం డబ్బు కట్టామని నాగం జనార్థన్‌ రెడ్డి అన్నారు. ఓ ప్రాజెక్టు పరిధిలో మరో ప్రాజెక్టు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఉన్న 13 ప్రాజెక్టులను తమ పార్టీ బృందానికి చూపాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఆ ప్రాజెక్టులకు ఎన్ని అనుమతులున్నాయో చూపమని సవాల్‌ విసిరారు. తమ పార్టీ నేతల పట్ల చవాన్‌ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. నేతలకు సౌకర్యాలు కల్పించాలని ఆయనను కోరతామని తెలిపారు. చంద్రబాబు, ప్రజాప్రతినిధుల పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తించారన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ నాయకుల అరెస్టు, పరిణామాలపై తెలుగుదేశం సీనియర్ నాయకులు హైదరాబాదులో సమీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+