చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష: టిడిపి నేతలకు అస్వస్థత

Chandrababu Naidu
ధర్మాబాద్‌: బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిరాకరించినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం నిరాహార దీక్షను ప్రారంభించారు. తనను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచిన ధర్మాబాద్ లోని ఐటిఐ కళాశాలలోనే ఆయన తన దీక్షను సాగిస్తున్నారు. మిగతా నాయకులు కూడా ఆయనకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. గత మూడు రోజులుగా ధర్మాబాద్ ఐటిఐ కళాశాలలో ఉన్న తెలుగుదేశం నాయకులు పలువురు అస్వస్థతకు గురయ్యారు. శాసనసభ్యులు సుమన్ రాథోడ్, వనిత, సుధారాణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్యులు సెలైన్ ఎక్కిస్తున్నారు. శాసనసభ్యుడు వేణుగోపాలాచారికి కీళ్ల నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో మిగతా నాయకులు ఆయనను లేపి కూర్చోపెట్టారు. మరో నాయకుడు దేవేందర్ గౌడ్ కూడా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

చంద్రబాబు పరిస్థితి కూడా అంత సజావుగా ఏమీ లేదు. అయినా ఆయన దీక్ష సాగిస్తున్నారు. దాదాపు పది మంది శాసనసభ్యులు అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకుల జ్యుడిషియల్ కస్టడీ సోమవారం సాయంత్రం ముగుస్తుంది. దీంతో వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత వారిని నాందేడ్ జైలుకు తరలించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. మరో వైపు చంద్రబాబును బాబ్లీ ప్రాజెక్టు వద్దకు తీసికెళ్లే ఆలోచన కూడా మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. కాగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మహారాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+