వీడియో ప్రసారం: మహా పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం

Chandrababu Naidu
ధర్మాబాద్: మహారాష్ట్ర పోలీసులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ఆయన విరుచుకుపడిన వీడియో దృశ్యాలను తెలుగు టీవీ టీవీ చానెల్ జీ 24 గంటలు మంగళవారం ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్ బుద్ధి చెపుతుందని చంద్రబాబు హెచ్చరించారు. తమ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. బెగ్గర్ల కన్నా హీనంగా తమను చూస్తున్నారని ఆయన విమర్శించారు. తమపై ఇంత చులకన భావమా అని ఆయన అడిగారు.

అందరికీ ఒకే బాత్ రూమా అని అడిగారు. కనీస సౌకర్యాలు లేక తమ శాసనసభ్యులు వ్యాధులకు గురవుతున్నారని ఆయన అన్నారు. కిడ్నాప్ చేసిన తీవ్రవాదులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించబోరని ఆయన అన్నారు. తాము ఏమైనా తీవ్రవాదులమా అని ఆయన అడిగారు. తాను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇంత దారుణం ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు. తమ శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు చంద్రబాబు కంటతడి పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+