చంద్రబాబుపై 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటాం: పాటిల్

చంద్రబాబుతో పాటు 34 మంది తెలుగుదేశం నాయకులను బస్సులో ఔరంగాబాద్ జైలుకు తరలిస్తున్నారు. వారు ఔరంగాబాద్ జైలుకు చేరుకోవడానికి కనీసం మరో మూడు గంటలు పట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో శాంతియుతంగా ఆందోళనలు జరపాలని, విధ్వంసాలకు, హింసకు పాల్పడవద్దని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ హక్కును రాజకీయ పోరాటం ద్వారా సాధించుకుందామని ఆయన చెప్పారు. కాగా, బస్సులోని తెలుగుదేశం నాయకులకు పోలీసులు ఆహారం కూడా అందించడం లేదు.












Click it and Unblock the Notifications