లక్నో: ఎఐసిసి ప్రధాన కార్యదర్సి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన యువజన కాంగ్రెసు నాయకుడు జులై 2వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. హర్జోయ్ జిల్లాలో మాయమైన అతని జాడ తెలియడం లేదు. మాజీ మంత్రి హన్షుముఖ్ పటేల్ కుమారుడు నిశాంత్ పటేల్ హర్దోయిలోని హోటల్ లాబీలో అతను చివరిసారిగా జులై 2వ తేదీన కనిపించాడు.
రాహుల్స్ మిషన్ యుపి కోసం పటేల్ కోత్వాలిలోని ఉత్సవ్ హోటల్లో ఉంటున్నాడు. కాగా, అతని మొబైల్ ఫోన్, సూట్ కేస్ హోటల్లో ఉన్నాయి. అతనేమయ్యాడనేది అంతు బట్టడం లేదు.