టిడిపి నేతలపై లాఠీచార్జీని ఖండించిన సిఎం రోశయ్య

ధర్మాబాద్‌లో తెలుగుదేశం నేతలపై మహారాష్ట్ర పోలీసులు చేసిన లాఠీఛార్జిని ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఖండించారు. మహారాష్ట్ర పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిందని మంత్రి అభిప్రాయపడ్డారు. టిడిపి నేతల ఆరోగ్య పరిస్థితి పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైద్య బృందాన్ని పంపినట్లు మంత్రి వెల్లడించారు. వైద్య పరీక్షల నివేదికలు ఇంకా అందాల్సి ఉందని ఆయన తెలిపారు. బాబ్లీ అంశంపై ఈనెల 23న ప్రధానిని కలవనున్న అఖిలపక్ష సమావేశంలో టిడిపి కూడా పాల్గొనాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications