పరిస్థితిపై సిఎం రోశయ్య ఆరా: వీధుల్లోకి టిడిపి శ్రేణులు

కాగా, మహారాష్ట్ర పోలీసులు చంద్రబాబు సహా తెలుగుదేశం ప్రతినిధుల పట్ల వ్యవహరించిన తీరుపై రాష్ట్రంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం శ్రేణులు వీధుల్లోకి వస్తున్నాయి. విశాఖపట్నంలో తెలుగుదేశం కార్యకర్తలు నాలుగు బస్సుల అద్దాలు పగులగొట్టారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో మహారాష్ట్ర వాహనాలపై దాడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాస్తోరోకో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రాస్తోరోకోలు, ధర్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications