హై కమాండ్ తీరుపై వైయస్ జగన్ అసహనం

తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర ప్రారంభమైన తర్వాత ముందు రోజు ఎంత ఆలస్యమైనా సుమారు 10 గంటల సమయంలో యాత్ర ప్రారంభిస్తున్న జగన్ సోమవారం మాత్రం 11.30 గంటలకు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆదివారం రాత్రి గొల్లల మామిడాడలో బసచేసిన జగన్ అంబటి సస్పెన్షన్ ఉదంతం తర్వాత పరిణామాలపై జిల్లాకు చెందిన నాయకులతో సుదీర్ఘంగా చర్చించడంతో పాటు, మున్ముందు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై ఫోన్‌లో కేవీపీ, ఉండవల్లి వంటి సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. సోమవారం నాటి ఓదార్పు యాత్ర అనపర్తి, మండపేట నియోజకవర్గాల్లో సాగింది.












Click it and Unblock the Notifications