తెలంగాణ ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు లాభించేనా?

చంద్రబాబు బాబ్లీ పోరు వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు పార్టీలు కొంత గందరగోళానికి గురయ్యాయి. చంద్రబాబు బాబ్లీ పోరును విమర్శించేందుకు తగిన పునాది ఆ పార్టీలకు లభించలేదు. అప్పటికీ కొంత ప్రయత్నం చేసినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వ ధోరణి వల్ల విమర్శలకు పదును పెట్టే అవకాశం లభించలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాబ్లీ నిర్మాణంలో అక్రమాలున్నాయనే విషయాన్ని బయటపెట్టింది. దీంతో తెరాస, కాంగ్రెసు పార్టీలు కొంత ఇరకాటంలో పడ్డాయి. పైగా, రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ఉప ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో కూడా చంద్రబాబు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపగలిగారు. ఇది ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందా అనేది సందేహమే. అయితే, తెలుగుదేశం పార్టీకి కాస్తా ఓట్ల శాతం పెరిగే అవకాశం లేకపోలేదని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications