చవాన్ గారూ, బాబు మీ బావ మరిదా: బాల్ థాకరే

చంద్రబాబుపై, ఆయన అనుచరులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ నెల 16వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన రోజునే తీసుకుని ఉండేదని థాకరే అన్నారు. శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్ కు తరలించే ముందు చంద్రబాబుకు జైలు దుస్తులు ధరింపజేయాల్సి ఉండిందని ఆయన అన్నారు. చంద్రబాబుకు చిప్ప కూడు పెట్టాల్సిందని ఆయన అన్నారు. మగ్గు నీళ్లు పోయాల్సిందని ఆయన అన్నారు. అలా చేసి ఉంటే తొలి రోజే జైలు తాళాలు పగులగొట్టి పారిపోయి ఉండేవారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications