కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికల కమిషన్ కొరడా: తెలంగాణ హోటల్ బంద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
కరీంనగర్: ఎన్నికల కమిషన్ (ఇసి) దెబ్బకు తెలంగాణ హోటల్ మూత పడింది. తెలంగాణ హోటల్ పేరుతో హోటల్ నడుపుతున్న వికలాంగుడి జీవనోపాధిపై వేటు పడింది. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ మండలం చాత్రాజుపల్లి గ్రామంలో తెలంగాణ హోటల్ అనేది ఎన్నికల నియమావళి కిందికి వస్తుందంటూ ఇసి దాన్ని మూయించేసింది. వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నందున ఆ హోటల్ ను మాయించినట్లు తెలుస్తోంది.

ఇసి తన హోటల్ ను ఇసి మూత వేయించడంపై హోటల్ యజమాని నరేందర్ మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. తెలంగాణ హోటల్ ను మూయించడంపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హోటల్ ను మూయించినప్పుడు ఆంధ్ర హోటళ్లపై వేటు పడాలని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X