కడప: కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సోదరులను దుండగులు దారుణంగా హత్య చేశారు. చాపాడు మండలం నక్కలదిన్నెలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం నేతలు శెట్టిపల్లి విశ్వనాథ్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డిని గుర్తుతెలియని ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు.
జంట హత్య కేసులో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మల్లారెడ్డి చెప్పారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిందితులను పట్టుకుంటామని ఆయన చెప్పారు.