వైయస్ గనుల నిర్ణయాలపై హైకమాండ్ వేటు

రోశయ్య ముఖ్యమంత్రి కాగానే కర్నాటక మంత్రి, వైయస్ కు అత్యంత సన్నిహితుడు అయిన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల అక్రమాలపై కూడా అధిష్ఠానం పోరాటం సాగిస్తోంది. గాలి జనార్దనరెడ్డి సాగిస్తున్న గనుల తవ్వకాల్లో ఇక్కడి పెద్దలకు వాటాలున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దాంతో ఓబుళాపురం అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. అడ్గగోలుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులను కూడా కీలక బాధ్యతల నుంచి తప్పించింది. ఇదే కాకుండా చీమకుర్తి గ్రానైట్ తదితర వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో జగన్ వర్గానికి కూడా చెక్ పెట్టవచ్చనేది ఢిల్లీ పెద్దల అభిప్రాయంగా చెబుతున్నారు. వైయస్ నిర్ణయాలను తిరగదోడడం ద్వారా జగన్ ఆర్థిక బలాన్ని నిర్వీర్యం చేయాలనేది కాంగ్రెసు అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications