హైదరాబాద్: ఎన్నికల సంఘ రాష్ట్ర అధికారి ఐ.వి.సుబ్బారావు ఉప ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఆయన సచివాలయంలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈరోజు సాయంత్రం 5 గంటల తరువాత ప్రచారం సమాప్తం అవుతుందన్నారు. నియోజకవర్గాలకు చెందిన నాయకులు సాయంత్రం 5 గంటల తరువాత ప్రచారం ముగించాలని ఆయన చె ప్పారు. మీడియాలో ఎన్నికలకు సంబంధించి ఎటువంటి విశ్లేషణాత్మక కార్యక్రమాలు ప్రసారం చేయకూడదని కూడా ఆయన చెప్పారు. మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించారు.