మరో రోజు తెలంగాణ, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. దీంతో కోస్తాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. అటు కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. నూజివీడులో 10 సెంటీ మీటర్లు, అవనిగడ్డ, భీమవరంలలో 9, నర్సంపేట, తెనాలిల్లో 8, అచ్చెంపేట, కోడూరులో 7 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యింది.
గుంటూరు, మచిలీపట్నం, కంభం, ఏలూరు, కైకలూరు, పిడుగురాళ్లల్లో 6, కాకినాడ, నందిగామ, విజయవాడ, అమలాపురం, చింతలపూడి, కూనవరం, మంగళగిరి, పాలేరుబ్రిడ్జి, వనపర్తిల్లో 5, ధవళేశ్వరం, గోల్కొండ, జూరాల, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కొమరాడ, రేపల్లె, సత్తెనపల్లె, సంగారెడ్డి, తణుకు, వీరఘట్టంలలో 4, మెదక్, అరకు, మంచిర్యాల, భీమడోలు, పోలవరం, గుడివాడ, తిరువూరు, హుజూరాబాద్, కోయిదా, మధిర, మహబూబాబాద్, పరకాల, మందస, పాతపట్నం, రాజమండ్రిలలో 3సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications