వరంగల్: ఉప ఎన్నికలలో డబ్బు పంపిణీ జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజా హన్మకొండలోని వికాస్ నగర్ లో డబ్బులు పంచుతున్న టీడీపీ కార్యకర్తలు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. డబ్బులు పంచుతున్న టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.