హైదరాబాద్: బయ్యారం గనులతో వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్‌కుమార్ కు ఎలాంటి సంబంధమూ లేదని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి వివరణ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. బయ్యారం గనుల విషయంలో రక్షణ స్టీల్స్‌తో ఏపీఎండీసీ చేసుకున్న ఒప్పందంలో సాక్షిగా సంతకం చేసిన జె.అనిల్‌కుమార్..వైయస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్‌లు వేర్వేరు వ్యక్తులని స్పష్టం చేశారు. బయ్యారంలో లభించే ఇనుప ఖనిజం 'సీ' గ్రేడ్‌కు చెందినదని..అ ఖనిజం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఉపయోగపడదని చెప్పారు. ఆ ఖనిజాన్ని ఇవ్వాలంటూ విశాఖ స్టీల్స్ కోరుతుందని వస్తున్న వార్తలపై ప్రస్తావించగా..ఆ విషయం తనకు తెలియదన్నారు.