నెల్లూరు: వరకట్న వేధింపుల కేసులో నటి ఆమని సోదరుడిని పోలీసులు నెల్లూరులో అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరుకు చెందిన లీలావతిని ఆమని సోదరుడు శ్రీనివాస్ 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో నగదు, బంగారం కలిపి రూ. 25 లక్షలు ముట్ట చెప్పినట్లు లీలావతి తెలిపిందని సీఐ చెప్పారు.
ఇటీవల రెండో వివాహం చేసుకోవడంతోపాటు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నట్లు లీలావతి ఫిర్యాదు చేశారు. లీలావతి ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాస్ ను అరెస్టు చేశారు.