లగడపాటి సర్వే: తెలంగాణ ఉప ఎన్నికల్లో తెరాసదే విజయమట

మైనారిటీలు 90శాతం మంది కాంగ్రెస్‌కే అండగా నిలిచారని తెలిపారు. రాజీనామా చేసిన వారినే గెలిపిస్తామని అన్ని పార్టీలూ మాటివ్వడంవల్ల కాంగ్రెస్ శ్రేణులు ఓటింగ్‌కు దూరంగా ఉండటమో, రాజీనామా చేసిన వారికే సహకరించడమో జరిగిందని లగడపాటి చెప్పారు. భారీ స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాతైనా సెంటిమెంట్ ఉందని అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ - 'నేనెప్పుడూ సెంటిమెంట్ లేదని చెప్పలేదు. అది ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలకు తేడా ఉంది. నిజామాబాద్ లో రాజీనామా చేసిన బిజెపి హైదరాబాదులోని అంబర్ పేటలో ఎందుకు చేయలేదు' అని అన్నారు. తెలంగాణ ప్రజల్లో తెలుగుదేశం నాయకత్వంపట్ల నమ్మకం లేకపోవడంవల్లే ఆ పార్టీ అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోనుందని తెలిపారు. ఏకాభిప్రాయం లేనిదే తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి, హోం మంత్రి, వెంకయ్య నాయుడు, అద్వానీ, నితిన్ గడ్కరీలు వివిధ సమయాల్లో చెప్పారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications