సిద్ధిపేటలో ప్రజలు చరిత్ర తిరగరాశారు: హరీష్ రావు

Harish Rao
హైదరాబాద్‌ : తెలంగాణ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించి సిద్ధిపేట ప్రజలు చరిత్ర తిరగరాశారని విజేత, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు అన్నారు. భారీ మెజారిటీతో ఆయన సిద్ధిపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఉప ఎన్నికల ఫలితాలను సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా సిద్ధిపేట ప్రజలు తీర్పునిచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పురుటి గడ్డ అయిన సిద్ధిపేటలో తన విజయం ప్రజలదేనని ఆయన అన్నారు.

మూడు సార్లు ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేస్తూ తనను గెలిపించిన సిద్ధిపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. తనను గెలిపించిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ గెలుపు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ సాధించేంత వరకు పోరాటం చేస్తామని హరీష్ రావు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+