• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ ఉప ఎన్నికలు: అన్ని చోట్లా తెరాస ఆధిక్యం

By Pratap
|

Telangana map
హైదరాబాద్‌ : తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలంగాణ గాలి వీస్తోంది. ఉప ఎన్నికలు జరిగిన 12 స్థానాల్లో కూడా తెరాస, బిజెపి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 11 స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), ఒక చోట బిజెపి అభ్యర్థి ముందంజలో సాగుతున్నారు. నిజామాబాద్ అర్బన్ లో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా తన సమీప బిజెపి అభ్యర్థి లక్ష్మినారాయణ కూడా వెనకబడిపోయారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో మాత్రం కాంగ్రెసు అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి తెరాస అభ్యర్థి కావేటి సమ్మయ్యకు గట్టి పోటీ ఇస్తున్నారు.

సిద్దిపేటలో తెరాస అభ్యర్థి హరీష్ రావు భారీ మెజారిటీ దిశగా సాగుతున్నారు. తెరాసకు కాంగ్రెసు పార్టీ మాత్రమే పోటీ ఇస్తోంది. ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఊసు కూడా లేదు. సిరిసిల్లలో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుమారుడు కెటి రామారావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X