ఉప్పునీటి సముద్రంలో మంచినీటి బిందువు జగన్: అంబటి

తనను సస్పెండ్ చేసినట్లు పార్టీ అధిష్టానం నుంచి తనకు ఇప్పటి వరకు ఏ విధమైన సమాచారం అందలేదని ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా తనను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారో చెప్పలేదని ఆయన అన్నారు. తాను మొయిలీకి రాసిన లేఖకు కూడా సమాధానం రాలేదని ఆయన చెప్పారు. తాను ఏ విధమైన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, తనను సస్పెండ్ చేయడం అర్థరహితమని ఆయన అన్నారు. తన సస్పెన్షన్ విషయంలో పార్టీ నిబంధనావళిని పాటించలేదని ఆయన విమర్శించారు. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీనియర్లపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications