వచ్చే వారంలో మరో అల్పపీడనం, భారీ వర్ష సూచన

అల్పపీడనం యూపీ వైపు తరలిపోవడంతో ఆ రాష్ట్రంతో పాటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన రాష్ట్రంలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు తక్కువ వర్షపాతాలే నమోదయ్యాయి. లక్సెట్టిపేట 5 సెంటీమీటర్లు, సంగారెడ్డి 4, నందిగామ, నర్సీపట్నం, బద్వేల్, ఉట్నూరు, ఆసిఫాబాద్, బోధ్, నిర్మల్, ఆదిలాబాద్‌లో 3 సెం.మీ.ల చొప్పున వర్షం కురిసింది.
కరీంనగర్ జిల్లాలో 25వేల ఎకరాల్లో నీట మునిగిన పత్తి:కరీంనగర్ జిల్లాలో మూడు రోజులుగా కురిసిన వర్షాలతో 25 వేల ఎకరాల్లో పత్తి పంట, 1500 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. జిల్లాలో 8 చెరువులు, 57 కుంటలకు గండ్లు పడ్డాయి. వెయ్యి ఇళ్లకు నష్టం వాటిల్లింది.












Click it and Unblock the Notifications