తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనివార్యం: కేశవరావు

డిసెంబర్ 9 తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు వాదులంతా కట్టుబడి వున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వడం వల్లే, మా ఎమ్యెల్యేలు రాజీనామా చేయలేదన్నారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైన అంశమని, ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆంధ్రానేతల్ని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి త్వరలోనే సోనియాను కలిసి చర్చిస్తామని కేకే స్పష్టం చేశారు. తెలంగాణపై వాదనలకు, చర్చలకు కాలం చెల్లిందన్నారు. అంతేకాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా అనుకూలమని కేకే చెప్పారు. రాజకీయ వ్యవస్థ విఫలమైందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కార్యచరణ ప్రారంభించి ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు.












Click it and Unblock the Notifications