వైయస్ జగన్ వల్ల కూడా కాంగ్రెసు కు లాభం: మంత్రి బొత్స
State
oi-Santaram
By Santaram
విజయనగరం: అంబటి రాంబాబు సస్పెన్షన్ కు కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి జరిపిన ఓదార్పు యాత్రకు సంబంధంలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మాతోపాటు జగన్ కూడా కాంగ్రెసు పార్టీ అభివృద్ధికి చేస్తున్నారని ఆయన అన్నారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు.
బొత్స సత్యనారాయణ గతంలో వైఎస్ వర్గీయుడైనా ఈ మధ్య జగన్ కు దూరంగా రోశయ్యకు దగ్గరగా వ్యవహరిస్తున్నారు. జగన్ కు అనుకూలమైన వారిపై విమర్శలు చేయకుండా జాగ్రత్త్త పడుతున్నారు.